దాసగణు కృత
శ్రీ సాయినాథ స్తవన మంజరి

1.శ్రీ గణేశాయనమః ఓ సర్వాధారా! మయురేశ్వరా! సర్వసాక్షి గౌరికుమారా!ఓ అచింత్యా! లంబోదరా! శ్రీ గణపతి పాహిమం.
2.నీవు సకల గణాలకు ఆది ఈశ్వరుడవు. అందుకే నిన్ను గణేశుడు అంటారు. సకల శాస్త్రాలు నిన్ను ఆంగీకరిస్తున్నాయి. మంగళారూపా! పాలచంద్రా...!
3.ఓ శారదా ! వాగ్విలసినీ! నీవు పదాలను సృష్టించిన వాగీశ్వరివి.నీ అస్తిత్వం వలన ఈ సృష్టిలో కార్యకలాపములు అన్ని నడుస్తున్నాయి.
4.నీవు గ్రంధాకర్తలకు దేవతవు. నీవు దేశానికి ఎల్లప్పుడూ వజ్రకిరిటానివి. అన్నిటి అందు తల్లి నీ శక్తి మహాసముద్రం కంటే పెద్దది. ఓ జగదాంబా! నీకు నమస్కారం.
5.ఓ పూర్ణాబ్రహ్మ! సాధుసజ్జనప్రియా! ఓ సగుణరూపా!పండరీనాధా!కృపాసాగరా,పరమ దయామయా!పాండురంగా! నరహరి!
6.నీవు అందరిని నడిపించే సూత్రదారివి. నీవు జగమంతటా వ్యాపించి పూర్ణంగా నిండి వున్నావు. సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని అన్వేషిస్తున్నాయి.
7.ఓ చక్రపాణి! నీవు పుస్తకాజ్ఞానులకు అంతుపట్టవు .ఆ మూర్ఖలందరూ వాద వివాదాలు చేసే వారు.
8.సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగతవారు మౌనంగా వుంటారు.నీకు సాదరంగా నా సాష్టాంగనమస్కారం.
9.ఓ పంచవక్రా శంకరా! కపాలమాలధారీ! ఓ నీలకంఠ!దిగంబరా!ఓంకారరూపా!పశుపతి!
10.నీ నామాన్ని స్మరించిన వారి దైన్యం వెంటనే తొలగిపోతుంది.ధూర్జటీ! నీ నామం యొక్క మహిమ ఇటువంటిది.
11.నీ చరణములు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తున్నాను. నీలకంఠా! దీనిని సంపూర్ణం చేసేలా సహకరించు.
12.ఇప్పుడు అత్రిసుతునకు ఆదినారాయణునికి తుకారం మరియు ఇతర సాధుసత్పురుషులకు ,భక్తజనులందరికి నమస్కారం
. 13.జయ జయ సాయినాథా, పతిత పావన! పరమదయనిది! పవిత్ర చరణములు వద్ద శిరస్సు వుంచి నమస్కరిస్తున్నాను.అభయాన్ని అనుగ్రహించండి.
14.మీరు సుఖానికి నిలయమైన పూర్ణాబ్రహ్మ. పుషోత్తముడు అయిన విష్ణువు మీరే.అర్ధనారీశ్వరుడు మదనంతకుడు కూడా మీరే.
15.మీరు మానవ శరీరాన్ని ధరించిన పరమేశ్వరులు.మీరు జ్ఞానాకాశంలో భాస్కరులు,దయా సాగారులు. మీరు భవరోగానికి ఔషధం.
16.మీరు హీనులకు,దీనులకు చింతామణి. భక్తులకు పవిత్రగంగాజలం. మీరు ప్రపంచంలో మునిగిపోయే వారిని తరింపచేసే నౌక.మీరు భయభీతులకు ఆశ్రయం.
17.మీరు జగత్తుకు ఆది కారణం. దయాఘనా! నిర్మల చైతన్యమైనా ఈ సృష్టి విలాసం అంతా మీరే.
18.మీరు జన్మరహితులు.మీకు మృత్యువు లేదు.బాగా పరిశోధిస్తే చివరకు ఇదే అవగతమౌతుంది.
19.జననమరణాలు రెండు అజ్ఞానం వలన కలుగుతాయి. మహారాజా! మీరు రెండిటికి అలీప్తంగా వుంటారు.
20.నీరు ఒక చోట ఊటలా ప్రకటితమైంది అంతే అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా?ఆది నుండి అక్కడే పూర్ణంగా నిండి ఉండి లోపల నుండివచ్చింది. అంతే.
21. ఒక లోతు గుంతలో నీరు ఊరితే దానికి బావి అని పేరు కలదు. నీరు లేకపోతే అది ఒక గుంత మాత్రమే.
22. నీరు గుంతలో ఉరటం లేదా ఎండిపోవడం ఇది నీటికి అసలు పట్టదు. నీరు గుంతకు అసలు ఏ విలువ ఇవ్వదు.
23.అయిన నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం. అందువలన నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థ పొందుతుంది.
24.ఈ మానవ శరీరం నిజంగా గుంత వంటిది. ఇందులో శుద్ధచైతన్యం నిర్మలమైన నీరు. గుంతలు అసంఖ్యాకంగా ఉన్న నీరు అన్నింటిలోనూ ఒక్కటే. శరీరాలు అనేకం చైతన్యం ఒక్కటే.
25.సాయి దయామయా! జననమరణాలకు ఆతితమైన మీరు. అజ్ఞానమనే పర్వతాన్ని చేదించడానికి వజ్రాయుధం కావాలి.
26.భూమి పై ఇప్పటి వరకు అనేక గుండాలు వెలిశాయి.ఇప్పుడు ఉన్నాయి . ఇక ముందు ఉంటాయి.
27. ఆ ప్రత్యేక మైన గుండాలకు విశేషమైన నామరూపాలు ఉంటాయి. వాని ద్వారానే గుర్తించగలం.
28.అయితే చైతన్యన్నీ నువ్వు - నేను అనటం ఉచితం కాదు.ఎందుకంటే చైతన్యం లో దైవత్వం లేదు కనుక.
29.పైగా చైతన్యం జగమంతాట వ్యాపించి ఉంటుంది. అటువంటప్పుడు నీవు -నేను అనుభావన అక్కడ ఎలా సంభవం?
30.మేఘములో నీరు అంతటా ఒకేలా ఉంటుంది. భూమి పైనీరు పడగానే ఆ నీటికి అనేక బేధాలు కలుగుతాయి.
31.గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు.బావిలో పడిననీటికి నది జలానికి ఉన్న పవిత్ర లేదు.
32.గోదావరి సత్పురుషులు వలే పవిత్రం. మీరు అందులో నీరు మేముఅక్కడక్కడ ఉన్న ఉన్న వాపీ,కూప,తటకాలము అదే మీకు మాకు బేధం.
33.మీరు పవిత్రలు మీకు కృతార్థులవటానికి మీ వద్దకు చేతులు జోడించిమీ వద్దకు శరణాగతులై రావాలి.
34.గోదావరి జలాలకు పాత్రను బట్టి పవిత్ర వచ్చింది.నీరు వేరు ఎక్కడైనా ఒక్కటే.
35.గోదావరి జలాలు ప్రవహించే ఆ భూస్థలం పవిత్రమని అక్కడ భూమి యొక్క గుణాలను బట్టి నిర్ణయించబడింది.
36.మేఘాగర్భములో నీటిని ఏ ప్రదేశం ఏ మార్ఫు చేయదో అదే భూభాగాన్నిగోదావరి అని శాస్త్రవేత్తలు అన్నారు.
37.ఇతర ప్రదేశాలలో పడిన నీరు ఆయా స్థలాలా గుణాలను గ్రహిస్తాయి.మొదటిలో మధురంగా ఉన్న నీరు ఆ ప్రదేశం లోని ప్రభావం వలన ఆనారోగ్యంగా,ఉప్పగా, వగరుగా మారుతుంది.
38.శ్రీ సాయి గురువరా మీ పట్లే కూడా అట్లే ! కామక్రోధాది అరిషడ్ వికారాల మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామం శోభిస్తుంది.
39.అందువలన సత్పురుషులు గోదావరి అని నేను అంటాను.సకల జీవులలోను మీ యోగ్యత శ్రేష్ఠమైనది.
40. జగత్తు ఆరంభమైనప్పటి నుండి గోదావరి ఉంది. నీరు కూడా ఏ లోపం లేకుండా ఈనాటి వరకు పరిపూర్ణంగా ఉన్నది.
41.శ్రీ రాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు నదిలో ఉన్న నీరు ఇప్పటివరకు ఉంటుందా.
42.నీరు ఉన్న స్థలం మాత్రం ఇక్కడ మిగిలిఉంది.నీరు సాగరంలో కలిసి పోతుంది.అయిన నీరు ఉన్న స్థలం యొక్క పవిత్రత నేటి వరకు స్థిరంగా ఉంది.
43.ప్రతి సంవత్సరం పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ పట్లకుడా ఇదే న్యాయం వర్తిస్తుంది.
44.ఒక శతాబ్దంలోనీదే సంవత్సరం.ఆశతాబ్దంలో సత్పురుషులు నీటి ప్రవాహం వంటివారు. సాధువులు ఆ నీటిపై అలలు వంటివారు.
45.ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనత్ సనకసనందాదులు వచ్చారు.
46.తరువాత నారద,తుంబుర,ధ్రువ,ప్రహ్లాద, బలి మొదలగు రాజులు శబరి,అంగదుడు, హనుమంతుడు,విదురుడు, గోప గోపికలు వచ్చారు.
47. ఇలా ఈనాటి వరకు పుష్కలంగా వచ్చారు. వారిని వర్ణించుటకు నేను ఆసక్తుణ్ణి.
48.ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన సాయినాధులైన మీరు వచ్చారు.
49.అందువలన మీ దివ్య పవిత్రమైన చారణములకు నేను వందనం చేస్తున్నాను.శ్రీ సాయి ప్రభూ! నా దుర్గుణాలను పరిగణించకండని వేడుకుంటున్నాను.
50.శ్రీ సాయినాథా నేను హీనుణ్ణి,ధీనుణ్ణి,అజ్ఞానుణ్ణి,పాత కాశిభమణిని,ఇలా సకల చేడు లక్షణాలు కలవాణ్ణి అయిన దేవా! నన్ను ఉపేక్షించకండి.
51.పరుశువేది ఇనుములో దోషాలు పట్టించుకోదు. గోదావరి ఊరిలో కాలువలను బహిష్కరించదు.
52.శ్రీ సాయిబాబా మీ కృపాకటక్షములతో నాలోని ఉన్న సకల కల్మషాలను త్వరగా తొలగించండి ఇదే ఈ దాసుని విన్నపము.
53.పరుశువేది సాంగత్యంతో ఇనుము బంగారం కాకపోతే ఆ లోపం పరుశువేదిది.
54.మీరు పరుశవేది నేను ఇనుము నాలో పరివర్తన రాకపోతే ఆ లోపం మీ పైన ఆపాదింపబడకూడదు. మీకు అప్రతిష్టరాకూడదు.కనుక నన్ను పాపిగా ఉంచకండి.
55.పిల్లలు ఎప్పుడు తప్పులు చేస్తువుంటారు.కానీ తల్లి కోపగించుకోదు. దీనిని దృష్టిలో ఉంచుకొని శ్రీ సాయిబాబా నన్ను అనుగ్రహించండి.
56.ఓ సద్గురు సాయినాధా! మీరే మా కల్పతరువు, భవసాగరాన్ని దాటించే నౌక నిచ్చయంగా మీరే.
57.మీరు కామధేనువు, చింతామణి,మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు.సద్గుణాలగని, స్వర్గానికి సోపానము.
58.ఓ పరమపావన పుణ్యమూర్తి! శాంతిస్వరూపా!ఆనందఘనా! ఓ చిత్స్వరూపా! పరిపూర్ణ! ఓ బేధారహిత!జ్ఞానసింధూ!
59.ఓ విజ్ఞమూర్తి!పురుషోత్తమ!క్షమాశాంతుల నిలయమా! ఓ భక్తజనుల విశ్రమదామమా!నన్ను అనుగ్రహించండి.
60.మీరు సద్గురు మచ్చింధ్రులు. మీరే మహాత్ములైన జలందర్, మీరే నివృత్తినాద్ జ్ఞానేశ్వరులు, కబీర్,షేక్ మహమ్మద్, ఏకనాథులు మీరే.
61.మీరే బోధలా,సావతమలి,సమర్ధ రామదాసూ మీరే! సాయినాదా మీరే తుకరాం. మీరే సఖారాం, మీరే మణిఖ్యప్రభు.
62.మీ అవతారాల లక్ష్యం అనూహ్యం. మీరు మీజాతిని గూర్చి ఎవరికి తెలియపరచలేదు.
63.మీరు బ్రహ్మణులు అని కొందరు,యవనులు అని కొందరు అంటారు.మీరు శ్రీ కృష్ణుని వలే లీలలు ప్రదర్శించారు.
64.శ్రీ కృష్ణుని ప్రజలు పలురకాలుగా అన్నారు. కొందరు యదుకుల భూషణుడని అన్నారు. మరి కొందరు పశువుల కాపరి అని అన్నారు.
65.సుకుమారా బాలుడు అని యశోద అన్నది.మహకాలుడని కంసుడన్నడు.
66.ఆ విధంగా శ్రీసాయిగురుదేవా! ప్రజలు మిమ్మల్ని వారి వారి మనసులకు తోచినట్లు భావిస్తున్నారు.
67.మీ నివాసస్థానం మసీదు.మీ చెవులు కుట్టి ఉండేవి.మీరు పాటించిన మహమ్మదీయ నైవేద్య పద్ధతులు చూచి ప్రజలు మిమ్మల్ని ముసల్మను అని తలచారు.
68.కానీ దయా ఘనా! మీ అగ్ని ఆరాధన గని మీరు హిందువని మా మనసులను నిచ్చయమైంది.
69.ఈ వ్యావహారిక బేధాలలో తార్కికులు తర్జనభర్జనలు చేస్తారు. కానీ జిజ్ఞానులు భక్తులు వీటిని పట్టించుకోరు.
70.మీది పరబ్రహ్మస్థితి, జాతి మతాలు మీకు వర్తించవు. మీరు అందరికి గురుమూర్తి,మీరు ఆది కారణులు.
71. హిందూ ముసల్మనులలో వైరవభావం ఉన్నది. వారిలో ఐక్యతను కలిగించటానికి, భక్తులకు మీ లీలలను చూపించతనికి మీరు మసీదులో అగ్నిఆరాదన చేపట్టారు.
72.మీరు జాతి మతాలకు అతీతమైన సాక్షాత్ సద్ వస్తువు.పరబ్రహ్మ అందువలన మీరు తర్కానికి అంతు చిక్కరు.
73.తర్కవితర్కల గుర్రపు స్వారీ మీ వద్ద నిలువజాలదు. అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా?
74.అయినా మిమ్మలి చూసి నేను మౌనంగా ఉండలేను . కారణం వ్యవహారంలో స్తుతించడానికి సాహిత్యలో మాటలే సాధనాలు.
75.అందువలన ఎల్లప్పుడూ మీ అనుగ్రహంతో సాధ్యమైనంత వరకు వర్ణిస్తూ ఉంటాను.
76.సత్పురుషుల ఘనత గొప్పది.దేవతలకంటే కూడా అధికం. ఎందుకంటే సత్పురుషుల వద్ద 'నా' - 'నీ' అనే బేధబావాలు ఉండవు.
77.హిరణ్యకశిపుడు, రావణాసురుడు దేవుణ్ణి ద్వేసించుట వలన వధింపబడ్డారు. అలా సత్పురుషుల చేతిలో వధింపబడిన వారు ఎవరు లేరు.
78.గోపీచంద్ జనులందరుని పెంటకుప్పలో పాతి పెట్టినప్పుడు ఆ మహాత్మునకు దుఃఖం కలుగలేదు.
79. సరికదా...! పై పెచ్చు ఆ రాజుని ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమను ఎంతని వర్ణించగలను?
80.సత్పురుషుల సూర్యనారాయణుని వంటివారు.వారి కృపా జ్ఞానప్రకాశం. వారు చల్లటి సుఖాన్ని ఇచ్చే చంద్రుని వంటివారు.వారి కరుణా వెన్నెల వెలుగు.
81.సత్పురుషులు కస్తూరి వంటి వారు.వారి కృపపరిమళం వంటిది. సత్పురుషులు చెరుకు రసం వంటివారు వారి కృప మధురం.
82.సత్పురుషులు దుష్టులపట్ల,శిష్ఠులపట్ల సమాన దృష్టి కలిగి ఉంటారు. అంతే కాదు పాపుల పట్ల ప్రీతి ఎక్కువ.
83.గోదావరి జలంలో శుభ్రపరచడానికి మాలిన వస్త్రాలే వస్తాయి. శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టిలోనే ఉంటాయి.
84. పెట్టిలో బట్టలు కూడా శుభ్రపరచడానికి ఒకప్పుడు గోదావరికి వచ్చినవే.
85.ఇక్కడ ఆ పెట్టి వైకుంఠం. మీరు గోదావరి.శ్రద్ధ సాన్నఘట్టం. జీవాత్మలే వస్త్రములు. వాని మాలిన్య షేడ్ వికారాల.
86.మీ పాద దర్శనమే గోదావరి సాన్నం. మీరు మా సకల మాలిన్యాలను తొలగించి నిర్మలంగా చేయగల సమర్థులు మీరు.
87.మేము ఈ ప్రపంచంలో మాట మాటకి మలినులమై పోతున్నాము సాయిప్రభో. అందువలన సత్పురుషులు సందర్శనం అవసరం.
88.గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి,ఆ నీటిని శుభ్రపరచటానికి తెచ్చిన మలిన శుభ్రం కాకుండా అక్కడ సాన్నఘట్టాల పై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ట కాదా..!
89.మీరు చల్లటి నీడ నిచ్చే వృక్షం. మీ తాపత్రయం అనే తీవ్ర ఎండవేడికి బాధ పడిపోతున్న బాటసారులము.
90.ఓ సాయి గురువార్య! కరుణామయా! మమ్ములను ఈ తాపత్రయాల నుండి రక్షించండి. చల్లటి నీడ వంటి మీ కృప లోకొత్తరమైనది.
91.నీడ కోసం ఒక వృక్షం క్రింద కూర్చుంటే పైనుండి ఎండ వేడి తగులుతుంటే ఆ వృక్షాన్ని నీడనిచ్చే చెట్టు అని ఎవరు అంటారు!
92.మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడటం జరగదు. ధర్మస్థాపన కొరకు అర్జునునికి శ్రీ కృష్ణుడు సఖునిగా లభించారు.
93.సుగ్రీవుని కృపతో విభీషణునికి శ్రీ రామప్రభువు లభించారు. సత్పురుషుల వలనే భగవంతునికి ఘనత.
94.వేదశాస్త్రలు వర్ణించలేని నిరాకారనిర్గుణ పరబ్రహ్మను సుగుణాకరా రూపంలో భూమిపైకి అవతరింపచేసింది సత్పురుషులే.
95.రుక్మిణీ వల్లభుడైన వైకుంఠపతియగు శ్రీ కృష్ణునిన్ని దామాజి మాలవాడగా చేసాడు. చోఖాబా జగన్నాథునితో పశువుల శవాలను మోయించాడు.
96.సత్పురుషుల మహిమ ఎరిగి శ్రీహరి సక్కుబాయి ఇంట నీళ్ళు మోసాడు. నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు.
97.ఇంకా అధికంగా ఎం మాట్లాడను. ఏమి చెప్పనవసరం లేదు . శ్రీ సాయి నాధా! షిర్డీ గ్రామ నివాసి! మీరే మా తల్లి తండ్రి .
98.బాబా ! మీ లీలలు ఎవరికి అంతుపట్టవు. అటువంటప్పుడు పామరుణ్ణినైనా నాకు మీ లీలలు వర్ణించడం సాద్యమా?
99.జడలు వంటి జీవులను ఉద్ధరించడానికి మీరు షిర్డీ వచ్చారు. ప్రమీదలలో నీరు పొసి దీపాలు వెలిగించారు.
100.మూరెడు వెడల్పుగల చెక్కపలకను మంచంలా, పైన చెక్కకు వేలాడగట్టి , దాని పై శయనించి భక్తులకు మీ యోగ శక్తి సామర్ధ్యాన్ని తెలియజేసారు.
101.మీరు అనేకులు సంతానాన్ని అనుగ్రహించారు. విభూతుని ప్రసాదించి అనేకులు రోగాలను పోగొట్టారు.
102.ఐహిక కష్టాలు తొలగించుట మీకు ఆశక్యం కాదు.గజరాజుకు చీమ బరువా?
103.సాయి గురుదేవా ! ఈ దీనుణ్ణి కరుణించండి.మీ చరణములకు శరణుజొచ్చిన నన్ను వెనుకకు త్రోసి వేయకండి.
104.మీరు మహారాజులకు మహారాజు, కుబేరులకు కుబేరులు, వైద్యులకు వైద్యుడు, నిశ్చియంగా మీ కంటే శ్రేష్టలు ఎవరు లేరు.
105.ఇతర దేవతల పూజలకు విశేషమైన పూజా సామగ్రి, ప్రత్యేక పూజా విధానం అవసరం.కానీ మీ పూజకు విశిష్టమైన పూజ సామగ్రి, ప్రత్యేక పూజ విధానం అవసరం. కానీ మీ పూజకు జగత్తులో విశిష్టమైన వస్తువు ఏది లేదు.
106.సూర్యుని ఇంటిలో దీపావళి పండుగ వచ్చినట్లు అయితే, ఏ ద్రవ్యలతో పండగను జరుపుకుంటారు.
107.సాగరం యొక్క దప్పికను తీర్చడానికి భూమి పై ఉన్న నీరు సరిపోతుందా? అగ్ని రగలచ్చటానికి నిప్పు ఎక్కడ నుండి తీసుకురావాలి.
108.గురు దేవా - శ్రీ సాయి సమర్దా! పూజ చేసి వస్తువులన్నీ ఆది నుండి మీ ఆత్మ యొక్క అంశములే.
109.ఈ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పటమే గాని పరమాత్మ తత్వం ఇంకా అంతుపట్టలేదు.అందువల్ల అనుభవజ్ఞానం లేకుండా చెప్పే మాటలు నిరార్ధకం.
110.మీ పూజను వ్యావహారికంగా చేయటానికైనా నాకు సామర్ధ్యం లేదు.
111. అందువలన గురుదేవా! అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను. దాయమయా! ఈ దాసుని యొక్క పూజను స్వీకరించండి.
112.ఇక ప్రేమాశ్రువులతో మీ చరణలను ప్రక్షళనం చేస్తాను.సద్భక్తి అనే చందనాన్ని రాస్తున్నాను.
113.శబ్దాలంకారాలనే కాఫీనీని సమర్పిస్తున్నాను.ప్రేమా భావాలనే సుమమాలగా మీ కంఠానికి అలంకరిస్తున్నాను.
114.నా దుర్గుణాలను ధూపంగా దహింపచేస్తాను.అవి చెడు ద్రవ్యాలే అయిన వాటినుండి చెడు వాసనలు రావడం లేదు.
115.ధూప ద్రవ్యాలను సద్గురువు వద్ద కాకుండా ఇతరత్రా ఎక్కడ వేసిన వాటినుండి చెడు వాసనలే వస్తాయి.
116.ధూప ద్రవ్యాలను అగ్ని తాకగానే తక్షణం వాని నుండి సహజ వాసనలు వెలువడతాయి.
117.కానీ మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది. మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గునాల పరిమళం ప్రపంచానికి తెలిసేలా మిగిలి ఉంటుంది.
118.గంగా జలంలో మురికి పోగానే నీరు నిర్మలమవటం సహజం కదా! మనసులో మలిన్యంపోయి మనసు నిర్మలమౌతుంది.
119.శ్రీ సాయిగురుదేవా! నేను మాయా మోహములు అనే దీపాలను వెలిగిస్తున్నాను.దాని వలన వైరాగ్య ప్రభలను లాభం పొందేలా అనుగ్రహించండి.
120.మీరు ఆశీనులవటానికి శుద్ధమైన శ్రద్ధ అనే సింహసనాన్ని అర్పిస్తున్నాను. దానిపై విరాజమానులై భక్తి నైవేధ్యాన్ని స్వీకరించండి.
121.ఈ భక్తినైవేద్యాన్ని మీరు సేవించి , భక్తిరసాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను మీ బిడ్డను కనుక మీ బోధామృతరసాన్ని సేవించే అధికారం నాకు ఉన్నది.
122.నా మనసు మీకు దక్షణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల నాకు ఎటువంటి కర్తృత్వభావం ఉండదు.
123.ఇక ప్రార్థన పూర్వకముగా సాష్టాంగదండ ప్రణామాలు చేస్తున్నాను స్వకరించండి.
*ప్రార్ధనాష్టకం* 124.శాంతిచిత్తా! మహాప్రజ్ఞా!శ్రీ సాయినాథా! దయఘనా! దయసింధూ! సత్స్వరూపా!మయాతమ వినాశకా!
125.(1)జాతి మాత గోత్రాతీతా! సిద్దా! అచింత్య! కారుణాలయా! పాహిమాం - పాహిమాం సాయినాథా ! శిరిడీగ్రామనివాసీ !
126.(2)శ్రీ జ్ఞానభాస్కరా! జ్ఞానదాత!సర్వమంగళకారకా!భక్తచిత్తమరళా, ఓ శరణాగతి రక్షకా...
127.(౩)మీరు సృష్టికర్త బ్రహ్మా, మీరు పాలన కర్త విష్ణుమూర్తి, త్రిలోకలను లయం చేసే మహేశ్వరులు మీరే.
128.(4) ఈ పృథ్వితలం అందు మీరు లేని చోటు ఉందా? శ్రీ సాయినాథా మీరు సర్వజ్ఞులు , సర్వహృదయాలలోనూ వున్నారు.
129.(5)మా సర్వాపరాధాలను మన్నించండి. భక్తిహీనుడను సంశయ హృదయుడను అగు నా సంశయాలను తొలగించుము.
130.(6) మీరు ఆవు. నేను లేగదూడను. మీరు చంద్రుడు నేను చంద్రచూడకాంతమణిని.గంగా నదీ రూపమైన మీపాదాలకు ఈదాసుడు సాదరంగా నమస్కరిస్తున్నాడు.
131.(7)నా శిరస్సు పై మీ కృపహస్తాన్ని ఉంచండి.మీ దాసుడైన ఈ గణుని *(గణుని అని ఉన్న దగ్గర మీరు పేరుని చదువుకోగలరు)* చింతలను దుఃఖలను నివారించండి.
132.(8)ఈ ప్రార్ధనాష్టకంతో మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మా పాపతాప దైన్యాలను త్వరగా నివారించండి.
133. శ్రీ సాయినాథా మీరు ఆవు. నేను లెగ దూడను. మీరు మా తల్లి .నేను మీ బిడ్డను. నా విషయంలో మీ మనసును కాఠిన్యతను వహించకండి.
134.మీరు మలయగిరి చందనం. నేను ముళ్ల పొదను. మీరు పవిత్ర గోదావరి నీరు. నేను మహాపాతకుణ్ణి.
135.మీ దర్శనమయ్యాక కూడా నాలో మనోమాలిన్యాలను తొలగించక ఇంకా ఉంటే మిమ్మల్ని చందనం అని ఎవరంటారు?
136.కస్తూరి సాంగత్యంతో మట్టికి విలువ వస్తుంది.పూల సహవాసంతో ఉన్న దారం శిరస్సు పై ఉంటుంది.
137.అదే విధంగానే మహాత్ములు చేపట్టిన వస్తువులు విశిష్టతను సంతరించుకుంటాయి.
138.పరమేశ్వరుడు తన కోసం విభూతిని,మృగచర్మాన్ని నందిని స్వీకరించాడు. ఆకారణంగానే వాటికి అంతటా గౌరవం లభిస్తుంది.
139.శ్రీ కృష్ణుడు గోపాలురును రంజింపచేయటానికి, బృందావనంలో యమునా తీరాన ఉత్తలుకొట్టే ఆటాలడారు. దానిని కూడా బుధులు గౌరవించారు.
140.నేను దూరచారిని అయినా మీ శరణుజొచ్చాను. అందువలన గురుదేవా! నాగురించి కాస్త ఆలోచించండి.
141.ఐహిక లేక పారమార్ధిక వస్తువులు ఏవేవీ నా మనసుకు సుఖమనిపిస్తాయో వానిని ప్రసాధించండి సాయిగురుదేవా!
142.నా మనసు నిగ్రహించుకునేలా నన్ను అనుగ్రహించండి. సముద్రపు నీరు తీయగా మారితే ఉప్పు నీటికి భీతి చెందవలసిన అవసరం లేదు కదా!
143.సాగరాన్ని మధురంగా మార్చిగల సామర్ధ్యం మీకు ఉన్నది. అందువలన ఈ దాసగను *(దాసగను అని ఉన్న దగ్గర మీ పేరు చదువుకోగలరు)* కోరికను మన్నించండి.
144.నాలో ఉన్న లోపాలన్ని మీవే. మీరు సిద్ధులకు రాజు మీకు ఉపేక్ష శోభించదు.
145.ఇంకా అధికంగా ఎం మాట్లాడను.మీరే మాకు అధికారం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు నిర్భయం సహజం కధా!
146.ఈ స్తోత్రాన్నీ ఎవరైతే భక్తిగా పఠిస్తారో వారి కోరికలు మీరే తీర్చాలి.మహాప్రభు,
147.ఈ స్తోత్రానికి మీ ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలి. ఒక సంవత్సరంలో పాఠకుల త్రీతాపాలు తొలగిపోవాలి.
148.శుచిర్భూతులై తమ మనసులో శుద్ధమైన భక్తిభావంతో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి.
149.ఇది వీలుపడకపోతే ప్రతి గురువారమైనా సద్గురు మూర్తిని మనసున ధ్యానించి పఠించాలి.
150.ఇది కూడా వీలుకాక పోతే ప్రతి ఏకదాశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి, దీని ప్రభావాన్ని గ్రహించండి.
151.భక్తులారా ! ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహికకోరికలను గురుదేవులు వెంటనే తీర్చి, వారికి ఉత్తమ గతిని ప్రసాదిస్తారు.
152.ఈ స్తోత్ర పారాయణముతో మందబుద్ధులు బుద్ధిమంతులు అవుతారు.అల్ఫయుష్యులు శతాయుష్కులౌతారు.
153.ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనుల ఇంటకి కుబేరుడు నివసిస్తాడు. ఇది ముమ్మాటికీ సత్యం
154. ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతనహీనులకు సంతానం కలుగుతుంది. మరియు సకల రోగాలు నలుదిశలా పారిపోతాయి.
155.నిత్యం గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అవినాశియైన పరబ్రహ్మను తెలుసుకుంటారు.
156.కనుక బుద్ధిమంతులరా! మీ మనసులో ఈ స్తోత్రమందు విశ్వాసముంచండి. తర్క వితర్కాలనే చెడు ఆలోచనలకు ఆసలు చోటివ్వకండి.
157. షిరిడీ క్షేత్ర యాత్రను చేయండి. మనసుని బాబా పాదాలయందు లగ్నం చేయండి.భక్తకామ కల్ప ద్రువమైన సాయి ఆనాథులకు ఆశ్రయం.
158.వారి ప్రేరణ వలననే నేనీ స్తోత్రాన్ని రచించాను. లేకపోతే పామరుణ్ణిని అయిన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం?
159.శక. సం. 1840 భాద్రపద శుక్లపక్షంలో (9-9-1918) వినాయకచవితి సోమవారం రోజు సూర్యోదయమయాక, 160.మహేశ్వర వద్ద , పవిత్ర నర్మదానది తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి వద్ద

*శ్రీ సాయినాథ స్తవనమంజరి సమాప్తి అయింది.*
161.మహేశ్వర క్షేత్రమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలో ప్రతి పదాన్ని శ్రీ సాయినాధులు నా మనసున ప్రవేశించి పలికించారు.
162.శిష్యుడు దామోదరుడు వ్రాసి పెట్టాడు. దాసగునుణ్ణి
*(దాసగనుణ్ణి అని వచ్చిన దగ్గర మీ పేరు చదువుకోగలరు.)
* అయిన నేను సాధుసత్పురుషుల కింకారుణ్ణి.
163.స్వస్తి. శ్రీ సాయినాథ స్తవనమంజరి భవసాగర తారకం కావాలి. పాండురంగా! దీనినే దాసగణు
*(దాసగణు పెరు ఉన్న వద్ద మీ పేరు చదువుకోగలరు)
* అత్యదరంగా విన్నవించుకుంటున్నాడు. హరి హరార్పణమస్తు. శుభం భవతు.
పుండరీక వరదా! హరి విఠల్. సేతకాంత స్మరణ జయ జయ రామ.
పార్వతిపతే హర హర మహా దేవా......
*శ్రీ సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై*
*శ్రీ సద్గురు సాయినాతార్పణమస్తు. శుభం భవతు.*
సర్వం శ్రీసాయి: మరాఠీ మూలం శ్రీ హరిభక్త పారాయణ
గణపతిరావ్ దత్తా త్రేయ సహస్రబుద్దే
(దాసాగుణు మహరాజ్) (సంత్ కవి) (పుండలీకరావు).
షిర్డీ సంస్థాన్ వారు ప్రచురించిన గ్రంథం ఆధారంగా వ్రాయబడినది.
*వ్రాసిన వారు సర్వం శ్రీసాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ సాయిరాం.*
మరాఠీ మూలం శ్రీ హరిభక్త పారాయణ
గణపతిరావ్ దత్తా త్రేయ సహస్రబుద్దే (దాసాగుణు మహరాజ్) (సంత్ కవి) (పుండలీకరావు). షిర్డీ సంస్థాన్ వారు ప్రచురించిన గ్రంథం ఆధారంగా వ్రాయబడినది.