శ్రీ దివ్య సిద్ధ మంగళ స్తోత్రం

 Shri Siddha Mangala Stotram


శ్రీమదనన్త శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజ ।
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీ భవ ॥ ౧॥
శ్రీవిద్యాధరీ రాధాసురేఖా శ్రీరాఖీధర శ్రీపాద ।
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీ భవ ॥ ౨॥
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద ।
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీ భవ ॥ ౩॥
సత్యఋషిశ్వర దుహితానన్దన బాపనార్యనుత శ్రీచరణ ।
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీ భవ ॥ ౪॥
సవితృకాఠకచయనపుణ్యఫల భారద్వాజఋషిగోత్రసమ్భవ ।
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీ భవ ॥ ౫॥
దో చౌపాతీ దేవ లక్ష్మిగణసఙ్ఖ్యాబోధిత శ్రీచరణ ।
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీ భవ ॥ ౬॥
పుణ్యరూపిణీ రాజమామ్బసుతగర్భపుణ్యఫలసఞ్జాత ।
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీ భవ ॥ ౭॥
సుమతీనన్దన నరహరీనన్దన దత్తదేవ ప్రభు శ్రీపాద ।
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీ భవ ॥ ౮॥
పీఠికాపుర-నిత్యవిహారా మధుమతీదత్తా మఙ్గలరూపా ।
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీ భవ ॥ ౯॥
ఇతి శ్రీసిద్ధమఙ్గలస్తోత్రం సమ్పూర్ణమ్ ।

సిద్ధ మంగళ స్తోత్రం ఎలా వచ్చింది. :

శ్రీపాద శ్రీవల్లభుల వారికి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు వారి తాతగారు ఆయన పాదాలను తీక్షణంగా చూడగా అందులో శంఖు,చక్రాలు దర్శనమిస్తాయి. ఆ ఆనంద పారవశ్యంలో శ్రీపాదుల వారిని సాక్షాత్తు దత్త ప్రభువులుగా కీర్తిస్తూ సిద్ధ మంగళ స్తోత్రం ని పాడటం జరిగింది. సిద్ధ మంగళ స్తోత్రం శ్రీ పాదుల వారికి చాలా ఇష్టమైనటువంటి స్తోత్రం. ఎందుకంటే శ్రీ పాదుల వారి తాతగారైన సత్య ఋషీశ్వరుల వారంటే శ్రీపాదుల వారికి చాలా ఇష్టం వారికోసమే,వారి సన్యాసి కావలెననే కోరిక తీర్చడం కోసమే రెండో అవతారమెత్తవలసి వచ్చింది.శ్రీ పాదులవారికి అంత ఇష్టమైన తాతగారే స్వామిని కీర్తిస్తూ పాడితే ఇక ఆ స్వామి ఆ స్తోత్రాన్ని ఎంతగా ఇష్టపడతాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ స్తోత్రంలో ఉన్నవి సామాన్య మైన అక్షరాలు కాదు, మహా మంత్ర బీజాలు. ప్రతి మంత్ర బీజ సమన్విత అక్షరాన్ని ఒక విరాట్ స్వరూపం అనుకుంటే అందులో అంతర్లీనంగా శ్రీపాదుల వారు ఆత్మ స్వరూపులై కొలువుంటారు. అందుకే సిద్ధమంగళ స్తోత్రాన్ని శ్రీపాదులవారి దివ్యఆత్మ స్వరూపంగా అభివర్ణిస్తారు . ఈ సత్యాన్ని తెలుసుకున్న వారి జన్మ ధన్యం.సిద్ధమంగళ స్తోత్ర పవిత్రత తెలుసుకోలేక,తెలిసితెలియని జ్ఞానంతో ఎదురు ప్రశ్న వేస్తే అధోగతే.

పరమ పవిత్రమైన వేదాలకే శ్రీదత్తుని పవిత్రత అర్థం కాక.. దత్త పాదాలను శరణుకోరి సర్వం దత్తార్పనమంటూ ఉంటే ఇక మనమెంత. మాత్రం...? మన జ్ఞానమెంత మాత్రం...?. అంతటి పవిత్రమైన వేదాలే అపవిత్రమైన శునకముల(కుక్కల)రూపం లోనికి మారి దత్త పాదాలను నాకుతూ సేవ చేస్తున్నాయంటే ఇక ఆ పాదాల పవిత్రతను వర్ణించటం పది తలల ఆదిశేషునికి సైతం అసాధ్యమే. అటువంటప్పుడు వారి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరి జ్ఞానము సరిపోదు.ఆ జ్ఞాన సాగరుని దగ్గర మనము వినమ్రతతో సర్వశ్యశరణాగతికోరి దత్తపాదాలపైన సిరస్సునుంచి సర్వ తత్వాన్ని,జ్ఞాన్ని మనకు దత్తులవారు తెలియ పరుస్తారు. నేను జ్ఞానిని అని అన్ని మనకే తెలుసు అనే భావనతో మనము ఎదురు ప్రశ్న వేస్తే... జ్ఞానివయినప్పుడు నాతో నీకేం పని...? , నీతో నాకేంటి పని...?, అంటూ మనకు దూరంగా వెళ్లి పోతారు. వేదాలే దత్త పాదాలను శరణు కోరినప్పుడు, ఇక దత్త పాద దర్శనం, దత్త ధూళిలో ఒక్క రేణువుగా కూడా పనికిరాని మనకు సందేహాలు ఉండవచ్చా సద్గురు శ్రీసాయి దత్త............